లెండిగూడలో రెండోసారి సర్పంచ్ పదవి ఏకగ్రీవం
ASF: వాంకిడి మండలంలోని లెండిగూడ గ్రామ పంచాయతీకి ST మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. దీంతో ఆ గ్రామంలో ST మహిళ తాటి కుమారి ఒక్కరే ఉండటంతో ఆమెకు రెండోసారి సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా వరించనుంది. గతంలో కూడా ఆమె ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. మరోసారి ఆమెకే అవకాశం రావడంతో గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు.