అంగన్వాడీ పర్యవేక్షణ కమిటీల ఎన్నిక
MDK: చిన్నశంకరంపేటలో అంగన్వాడీ పర్యవేక్షణ, సహాయక కమిటీలను ఎన్నుకున్నారు. సూపర్‌వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉపసర్పంచ్ భానుప్రసాద్ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడం, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడటమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. అంగన్వాడి టీచర్లు ఉన్నారు.