మార్కాపురంలో విశిష్ట సేవా పురస్కారం

ప్రకాశం: మార్కాపురం శిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం విశ్వావసు నామ ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు రవి శర్మ ఉగాది పంచాంగ శ్రవణ వినిపించారు. అనంతరం మందిరం కార్యదర్శి గోపాలుని హరిహరరావు అధ్యక్షతన విశిష్ట సేవా పురస్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో కృషిచేసిన 15 మందికి విశిష్ట సేవా పురస్కారం అందజేసి ఘనంగా సన్మానించారు.