బెజ్జంకి సర్పంచ్ ఎన్నికల ప్రలోభాలపై ఏసీపీ హెచ్చరిక
SDPT: ఏసీపీ రవీందర్ రెడ్డి బెజ్జంకిలో సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బెజ్జంకిలో పోలీస్, బేటాలియన్‌తో ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, బెజ్జంకి ఎస్సై సౌజన్య పాల్గొన్నారు.