కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
RR: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో యాదయ్య అనే వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. గ్రామస్తుల వివరాలు... ట్రాన్స్‌ఫార్మర్ వద్ద యాదయ్యకు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.