VIDEO: ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర
JGL: రాయికల్‌లో బజరంగ్‌దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి గాంధీ చౌక్, పటేల్ విగ్రహం, శివాజీ విగ్రహం, పాత బస్టాండ్ మీదుగా సాగిన ఈ ర్యాలీలో రాయికల్ మండలంలోని హనుమాన్ దీక్ష పరులు, యువకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కాషాయ ప్రేమికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.