పోలీసుల తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి ఆగ్రహం..!
SRCL: వేములవాడ మున్సిపల్ 4వ వార్డు పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ ఆరోపించారు. తనను పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా అడ్డుకుంటూ, కాంగ్రెస్ అభ్యర్థిని మాత్రం స్వేచ్ఛగా లోపలికి అనుమతిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో విడుదల చేశారు.