'యువత అన్ని రంగాల్లో రాణించాలి'

'యువత అన్ని రంగాల్లో రాణించాలి'

JGL: యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన 350 మంది యువత వివిధ అంశాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రఘువరన్, డీఈవో రాము, జిల్లా క్రీడా శాఖ అధికారి రవికుమార్, పాల్గొన్నారు.