అదుపుతప్పి ట్రాకర్ బోల్తా.. వ్యక్తి మృతి
ఏలూరు చింతలపూడి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంచోటుచేసుకుంది. హైవే పై వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి చింతలపూడి-ఏలూరు రోడ్డుపై పడటంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆసమయంలో క్రింద ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాగా ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.