‘ప్రైవేట్ పాఠశాలకు నోటీసులు జారీ చేశాం'

‘ప్రైవేట్ పాఠశాలకు నోటీసులు జారీ చేశాం'

NZB: ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు జారీ చేసే ట్రాన్స్‌ఫార్మర్ సర్టిఫికెట్‌కి డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేశామని మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారం శుక్రవారం తెలిపారు. ఫీజుల పెండింగ్, టీసీ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.