సెల్ ఫోన్లు వెనక్కి ఇచ్చిన అంగన్‌వాడీలు

సెల్ ఫోన్లు వెనక్కి ఇచ్చిన అంగన్‌వాడీలు

NLR: వరికుంటపాడు మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు ఉదయగిరిలో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో మంగళవారం తమ సెల్ ఫోన్లు వెనక్కి ఇచ్చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు అందజేసిన సెల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని ఆన్‌లైన్ వర్క్ చేసేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. పనిచేయని పరికరాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.