‘ఇండియా-పాకిస్తాన్ అణు యుద్ధం చేసుండేవి’

‘ఇండియా-పాకిస్తాన్ అణు యుద్ధం చేసుండేవి’

ఇండియా-పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. తాను ఆపిన ఏడు యుద్ధాలలో ఈ ఇరు దేశాల మధ్య జరగబోయిన యుద్ధం పెద్దదని తెలిపారు. వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తామని తాను హెచ్చరించడంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని ఆయన వివరించారు. తాను జోక్యం చేసుకోకుంటే అణ్వస్త్రాలు కూడా వినియోగించేవారని ట్రంప్ వ్యాఖ్యానించారు.