నిరుపేదకు జిల్లా అధ్యక్షుడు ఆర్థిక సహాయం
MLG: జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన MD. గౌస్ పాషా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆర్థిక సహాయంతో ఫాస్ట్ ఫుడ్ స్టాండ్‌ను పంపిణీ చేశారు. అశోక్ ప్రజాసేవ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ పేదలకు అండగా నిలవడం అభినందనీయం అని నాయకులు తెలిపారు.