దొంగతనాల నివారణకు చర్యలు: ఎస్పీ

NRPT: ప్రజలకు అనుమానిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ప్రకటనలో అన్నారు. జిల్లాలో దొంగతనాల నివారణకు ఇప్పటికే పోలీసుల గస్తీని పెంచినట్లు చెప్పారు. దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.