హుజరాబాద్‌లో విశ్రాంత సైనికులకు ఘన సన్మానం
KNR: హుజరాబాద్‌లోని గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్ కార్యాలయంలో పనిచేస్తున్న 8 మంది విశ్రాంత భారత సైనికులను గురువారం ఘనంగా సన్మానించింది. ట్రస్ట్ నిర్వాహకులు జగదీశ్వర్, ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా దేశ రక్షణకు అంకితమైన సైనికులను గౌరవించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.