ప్రశాంతంగా వినాయక చవితిని నిర్వహించుకోవాలి: ఎస్పీ

MDK: వినాయక చవితి పండుగను ప్రతీ ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మండపం వద్ద వాలంటీర్లు కమిటీ సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. డీజీలకు అనుమతి లేదన్నారు.