సర్ధార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుకు దద్దాల నివాళి

సర్ధార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుకు దద్దాల నివాళి

ప్రకాశం: భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కనిగిరి వైసీపీ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత కోసం, పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలను, వారి త్యాగాలను ఆయన కొనియాడారు.