నిలిచిపోయిన వంతెన పనులను పరిశీలించిన ఎంపీడీవో

JGL: ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్యగల నిర్మాణ పనులు నిలిచిపోయిన హై లెవెల్ వంతెనను ఎంపీడీవో సలీం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్‌తో మాట్లాడి వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని R&B ఏఈ ఫైజాన్ను ఆదేశించారు. వంతెన నిర్మాణంతో వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక దారి ఇటీవల కురిసిన వర్షాలతో కొట్టుకపోయింది.