బార్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆమంచి

ప్రకాశం: చీరాల పట్టణంలో పట్టణ బార్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు ఆమంచిని సత్కరించారు.