తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు

తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు

ELR: నూజివీడు మండలం యనమదలకి చెందిన వరికూటి రాజు (60) గత నెల 30వ తేదీ నుండి కనిపించడం లేదని కుమారుడు విక్రమ్ రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. విక్రమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్సై జ్యోతి బసు తెలిపారు. గత నెల 30వ తేదీ ఇంటి నుండి సైకిల్ పై బయటకు వెళ్లిన రాజు కనిపించలేదని ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు.