సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం

సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం

NLR: విడవలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు NSS క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నాలుగో రోజు స్థానిక ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.