పామర్రు ఎమ్మెల్యేకు ప్రత్యేక గుర్తింపు

పామర్రు ఎమ్మెల్యేకు ప్రత్యేక గుర్తింపు

కృష్ణా: పామర్రు నియోజకవర్గంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన బసవతారకం అమెరికన్ ఎండో క్యాన్సర్ మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించినందుకు MLA వర్ల కుమార్ రాజాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆదివారం హైదరాబాద్‌లోని NTR భవన్‌లో జరిగిన NTR మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకల్లో ట్రస్ట్ ఛైర్మన్ నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రం అందుకున్నారు.