హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు
E.G: గోకవరం పీహెచ్‌సీ పరిధిలోని కొత్తపల్లి వైద్య అధికారులు డా. తిరన్, నిఖిత కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో సంజీవయ్య నగర్ జి-4 సాంఘిక సంక్షేమ శాఖ బాలురు, బాలికల హాస్టల్, కామరాజుపేట ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.