32 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా

32 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా

ప్రకాశం: మర్రిపూడి మండలానికి రామతీర్థం జలాశయం నుంచి సరఫరా చేసే తాగునీరు గత నాలుగు రోజుల నుంచి రాకపోవడం వల్ల మండలంలోని 32 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం మర్రిపూడి శివారులో ఉన్న రక్షిత మంచి నీటి పథకం ట్యాంక్ వద్దకు వెళ్లి మంచి నీరు తీసుకెళ్తున్నారు.