మహిళా జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి

KRNL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బి. లీలా వెంకట శేషాద్రి కర్నూలులోని మహిళా కారాగారాన్ని తనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఖైదీలకు ఎవరికైనా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని పెర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.