ఆన్‌లైన్ ద్వారా సులభంగా పన్నులు చెల్లించవచ్చు: కలెక్టర్
కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ పంచాయతీలకు సంబంధించిన పన్నులను ఆన్‌లైన్ ద్వారా సులభంగా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో ‘స్వర్ణ పంచాయితీ, నిమిషాల్లో పన్నులు చెల్లించండి’ పేరుతో రూపొందించిన ప్రచార గోడ పత్రికను జాయింట్ కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ బాలాజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్లో పన్నులు చెల్లించవచ్చని కలెక్టర్ తెలిపారు.