నర్సీపట్నంలో మొదలైన శ్రీనివాస కళ్యాణం

నర్సీపట్నంలో మొదలైన శ్రీనివాస కళ్యాణం

AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణం సోమవారం సాయంత్రం మొదలైంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. కళ్యాణ దాతలుగా చింతకాయల విజయ్ దంపతులు కూర్చున్నారు. భక్తులందరికీ శ్రీవారి సేవకులు తిరునామం అలంకరించారు. స్టేడియం అంతా గోవింద నామస్మరణతో మారుమొగింది.