పరీక్షల కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

జనగామ: పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్బంగా స్థానిక ST. మేరీస్ స్కూల్, ధర్మకంచ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలని శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా చూసి.. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలన్నారు.