నేడు అక్రమంగా పట్టుబడిన ఇసుకకు వేలం
KMM: తల్లాడ మండలం కుర్నవల్లి వద్ద అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకను ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తల్లాడ తహశీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 59.94 టన్నుల ఇసుక ఒక క్యూబిక్ మీటరుకు రూ. 642గా ధర నిర్ణయించారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.25,000 ధరావత్తు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది అని తాహశీల్దార్ తెలిపారు.