ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
NLR: బోగోలు మండలం పాత బంగారుపాలెంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి సీతారాములకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి సీతారాముల కళ్యాణం వీక్షించారు. శ్రీరాముడి కరుణ కటాక్షాలు గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.