ఇది మాకెంతో  కఠిన నిర్ణయం: CSK

ఇది మాకెంతో  కఠిన నిర్ణయం: CSK

సంజూ శాంసన్ కోసం ట్రేడ్ డీల్‌లో భాగంగా రవీంద్ర జడేజాను వదులుకోవడంపై CSK MD విశ్వనాథన్ స్పందించారు. ‘CSKకు ఎన్నో విజయాల్లో భాగమైన జడ్డూ, నిలకడగా రాణిస్తున్న సామ్ కరన్‌ను వదులుకోవడం మాకెంతో కఠిన నిర్ణయం. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ కోసమే ఇలా చేయాల్సి వచ్చింది. ఇరువురు ప్లేయర్లను సంప్రదించిన తర్వాతే మేము ఈ నిర్ణయానికి వచ్చాం’ అని తెలిపారు.