నూకాలమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించిన స్పీకర్
AKP: నర్సీపట్నం శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ఏర్పాట్లను శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పరిశీలించారు. భక్తుల రద్దీ, క్యూలైన్, తాగునీరు, ప్రసాదం సమస్యలేకుండా, ఎండ తీవ్రతలో మౌలిక వసతులు అందించాలని అధికారులను ఆదేశించారు. దేవదాయశాఖ, మున్సిపల్, పోలీస్ యంత్రాంగం, ఆలయ కమిటీ భక్తుల సౌకర్యం కోసం సమన్వయంతో పనిచేయాలన్నారు.