మూగజీవాల దాహార్తి తీరుస్తున్న నీటితొట్లు

ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని మారెళ్లలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన నీటి తొట్లు పశువులు దాహార్తిని తీరుస్తున్నాయి. మేత కోసం వెళ్లిన పశువులు మొన్నటి వరకు నీటి కోసం ఇబ్బందులు పడేవని పశుపోషకులు అన్నారు. నీటి తొట్ల నిర్మాణంతో పశువులకు నీటి సమస్య తీరిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.