VIDEO: సింహాచలంలో సహస్రనామార్చన

VIDEO: సింహాచలంలో సహస్రనామార్చన

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో సహస్రనామార్చన భక్తి శ్రద్ధలతో శనివారం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి మండపంలో అధిష్ఠింపజేశారు. వేదపండితులు భక్తుల గోత్రనామాలతో సంకల్పం పలికారు. శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన అనంతరం సహస్రనామార్చన నిర్వహించారు.