VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న కండలేరు వాగు

VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న కండలేరు వాగు

NLR: దిత్వా తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనుబోలు మండలంలోని కండలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. వరద ప్రవాహం అధికమవడంతో, ఎస్సై శివ రాకేష్ వాహనాలను అటువైపు వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసి, కానిస్టేబుల్ను కాపలా ఉంచారు. ఎవరూ వాగులో దిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు.