హర్యతండా గ్రామ పంచాయితీ కాంగ్రెస్ పార్టీ కైవసం!
KMM: రఘునాథపాలెం మండలం హర్యాతండా గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బానోత్ స్వాతికి బరిలో ఉన్న ఇతర పార్టీల పోటీ దారులు ఆమెకు మద్దతు తెలిపి ఎన్నికల పోటీ నుంచి వైదొలిగి, గ్రామస్తులతో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాగా నామినేషన్ల ఉపసంహరణ ముగిసినప్పటికీ గ్రామస్తుల తీర్మానం మేరకు స్వాతి ఒక్కరే పోటీలో ఉండనున్నారు.