లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు

ప్రకాశం: కొమరోలు మండలం తాటిచెర్ల మోటు సమీపంలో అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిద్రమత్తులో డ్రైవర్ వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.