ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్

SRD: కంది మండలం కాశీపూర్‌లోని ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాలు ఎరువుల నిల్వలు స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.