భారతి చట్టంపై అవగాహన సదస్సు

NLG: భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టమే భూ భారతి చట్టమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా గురువారం ఆమె నల్గొండ జిల్లా, మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి(భూమి హక్కుల చట్టం- 2025) పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.