VIDEO: బద్వేలులో దంచి కొట్టిన వర్షం
KDP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో బద్వేలు పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీని కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకి రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు సూచించారు.