దమ్మన్నపేట వాసికి డాక్టరేట్

దమ్మన్నపేట వాసికి డాక్టరేట్

SRCL: గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన బిజ్జి రవి కామర్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో ఆయన చేసిన పరిశోధనకు ఈ పట్టాను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రవికి, అధ్యాపకులు, గ్రామస్థులు, పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.