తహసీల్దార్‌కు తప్పిన ప్రమాదం
SDPT: గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ వైపు నుంచి గజ్వేల్ వైపు వస్తున్న కారు కోహెడ మండలం శంకర్ నగర్ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. కారులోని బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.