కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా ఇటిక్యాల స్వరూప
KNR: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా జమ్మికుంటకు చెందిన ఇటిక్యాల స్వరూపను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియామక పత్రం అందించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన సూచించారు.