సెల్‌టవర్ నిర్మాణం ఆపాలని ఆందోళన
KNR: శివనగర్ కాలనీలో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు ఆదివారం ఆందోళనకు దిగారు. బీజేపీ నాయకుడికి చెందిన స్థలంలో సెల్ టవర్ ఏర్పాటుకు కంపెనీ యజమాన్యం ఒప్పందం కుదుర్చుకోగా, స్థానికులు అడ్డుకున్నారు. టవర్ వల్ల రేడియేషన్ సమస్య ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి, టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలన్నారు.