వెలిగల్లు ప్రాజెక్టు నుంచి చెరువులకు నీటి సరఫరా: మంత్రి

వెలిగల్లు ప్రాజెక్టు నుంచి చెరువులకు నీటి సరఫరా: మంత్రి

అన్నమయ్య: రాయచోటిలో జలధార పథకం అమలులో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కంచాలమ్మ గండి చెరువు, మాండవ్య నదిని ఆధునీకరించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి నీటిని చెరువులకు మళ్లించి, రెండేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.