కొత్త మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గంగాపూర్ రోడ్డులోని కాటన్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించి వారి శ్రమకు తగిన న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ జ్యోతి, మున్సిపల్ ఛైర్ పర్సన్ పుష్పలత పాల్గొన్నారు.