కొబ్బరి చెట్లు పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం

కొబ్బరి చెట్లు పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం

కోనసీమ: మామిడికుదురు మండలంలో ఆదివారం ఉదయం వచ్చిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి పలుచోట్ల కొబ్బరి చెట్లు పడడంతో విద్యుత్ తీగలు తెగి విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఈ సందర్భంగా విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరం, మగటపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు.