వైభవంగా స్వామివారి గ్రామోత్సవం

కోనసీమ: నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భక్తులచే పూజలందుకుంటున్న ఐ. పోలవరం మండలం మురముళ్ల వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నంది వాహనంపై స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన నంది వాహనంపై శ్రీభద్రకాళి సమేతంగా వీరేశ్వరస్వామి భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చారు.