VIDEO: 'పది' పరీక్షలకు 24,399 మంది విద్యార్థులు

VIDEO: 'పది' పరీక్షలకు 24,399 మంది విద్యార్థులు

NZB: జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న SSC పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO అశోక్ కుమార్ తెలిపారు. మొత్తం 24,399 మంది విద్యార్థులు ఉండగా.. బాలురు 12,244, బాలికలు 12,155 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 144 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 144 మంది చీఫ్ సూపరింటెండెంట్లు,1,214 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.