పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్యాయత్నం
ములుగు జిల్లా గోవిందరావుపేట గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న చిలుక వెంకన్న నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న శంకర్ తనను డబ్బులు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోవడంతో సిబ్బంది ముందు దుర్భాషలాడారు వెంకన్న సూసైడ్ నోట్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.